Jun 01,2023 15:25

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : జూన్‌ 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఢిల్లీలో జరిగే 66వ అండర్‌ 19 జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్‌ బాలికల జట్టుకు కోచ్‌గా గరివిడి మండలం కోనూరు జిల్లా పరిషత్‌ హై స్కూల్‌ వ్యాయామ ఉపాధ్యాయరాలు జాతీయ క్రీడాకారిణి ఎస్‌.విజయలక్ష్మిని నియమించారు. జాతీయ కబడ్డీ క్రీడాకారిణి, వ్యాయమ ఉపాధ్యాయురాలు అయిన జిల్లా వాసికి రాష్ట్ర జట్టుకు కోచ్‌గా నియమించడం పట్ల జిల్లా కబడ్డీ క్రీడాకారులు జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షులు జి.ఈశ్వర్‌ కౌశిక్‌ , కార్యదర్శి సూరిబాబు ,అండర్‌ 19 స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి కృష్ణ ,ఉపాధ్యక్షులు బొమ్మనా రామారావు, ఎస్‌జిఎఫ్‌ కార్యదర్శి ఎల్‌.విరమణ, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం సభ్యులు, అసోసియేషన్‌ సభ్యులందరూ శుభాకాంక్షలు తెలియజేశారు.

  • మేనేజర్‌ గా స్వాతి

అండర్‌ 19 బాలికలు రాష్ట్ర జట్టుకు మేనేజర్‌గా సతివాడ మోడల్‌ స్కూల్‌ వ్యాయామ ఉపాధ్యాయురాలు పి.స్వాతి ఎంపికయ్యారు. ఆమె ఎంపిక పట్ల జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ నాయకులు,వ్యాయామ ఉపాధ్యాయుల అభినందనలు తెలిపారు.