Oct 08,2023 22:02

ప్రజాశక్తి-అమరామతి బ్యూరో:వెంకట్రామిరెడ్డి జీవితం ఆదర్శనీయమని సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. వెంకట్రామిరెడ్డి మృతికి నివాళ్లు అర్పించారు. లెక్చరర్‌గా పనిచేస్తూనే 1970లో జరిగిన తిరువనంతపురంలో జరిగిన ఎస్‌ఎఫ్‌ఐ వ్యవస్ధాపక సమావేశంలో కర్నూల్‌ జిల్లా నుండి పాల్గన్న విద్యార్థి బృందానికి వెంకట్రామిరెడ్డి నాయకత్వం వహించారన్నారు. జిల్లాలో ఉద్యమాభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.