Sep 15,2023 09:55

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. గురువారం సాయంత్రం టిడిపి ఎంపి రామ్మోహన్‌నాయుడుతో కలిసి రాజమండ్రి విమానాశ్రయం నుంచి సాయంత్రం 6:30 గంటలకు బయలుదేరారు. టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో రాష్ట్రంలోని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత విధానాలను, పరిస్థితులను జాతీయ స్థాయిలో లోకేష్‌ వివరిండంతోపాటు పలువురు కేంద్ర మంత్రులను, జాతీయ నాయకులను కలవనున్నట్లు తెలిసింది. అలాగే రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు కొనసాగుతున్నాయని జాతీయ మీడియాకు వివరించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర పరిస్థితులు, కక్ష రాజకీయాలపై పార్లమెంటులోనూ చర్చించేలా ఎంపిలకు దిశానిర్ధేశం చేయనున్నట్లు తెలిసింది. ఢిల్లీలో ఎంపిలు రామ్మోహన్‌నాయుడు, గల్లా జయదేవ్‌, రఘురామ కృష్ణరాజుతో కలిసి జాతీయ నాయకులను కలవనున్నట్లు సమాచారం.