Sep 19,2023 20:31
  • ఎఫ్‌డిసి ఛైర్మన్‌ పోసాని కృష్ణ మరళి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎలాంటి పైరవీలు లేకుండా పారదర్శకంగా నాటక నంది అవార్డులకు ఎంపిక చేస్తున్నట్లు ఆంధప్రదేశ్‌ ఫిల్మ్‌ టెలివిజన్‌, థియేటర్‌ డెవలప్‌మెంటు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పోసాని కృష్ణ మురళి అన్నారు. మంగళవారం ఆర్‌టిసి కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నంది నాటక అవార్డులకు అన్ని కేటగిరిలకు కలిసి 115 ఎంట్రీలు వచ్చాయన్నారు. వీటిని తిలకించేందుకు మూడు గ్రూపుల చొప్పున న్యాయ నిర్ణేతలను నియమించామన్నారు. వీరు ఈ నెల 7 నుంచి 18 వరకు తిలకించి ఒక్క లిస్టును తయారుచేశారన్నారు. ఈ పోటీల్లో గెలిపొందిన పద్య నాటకానికి రూ.50 వేలు, సాంఘిక నాటకానికి రూ.40 వేలు, సాంఘిక నాటికకు రూ.25 వేలు, బాలల నాటికకు రూ.25 వేలు, కాలేజీ, విశ్వవిద్యాలయాల నాటికకు రూ.25 వేలు చొప్పున పారితోషికంతో నవంబరులో నంది అవార్డులను ప్రదానం చేస్తామన్నారు.

చంద్రబాబుకు దిక్కులేదు

చంద్రబాబుకు దిక్కులేకుండాపోయిందని, ఆయన వెంటే ఉంటే అసలు ఏ దిక్కూ లేకుండాపోతుందని పోసాని అన్నారు. ప్రజాధనాన్ని కొల్లగొడితే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకుంటాయా? అని ప్రశ్నించారు.