ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నారా లోకేష్ తనను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారని, ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని ఎపి ఫిలిమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని మురళీకృష్ణ కోరారు. ఈ మేరకు బుధవారం మంగళగిరిలో డిజిపి కెవి రాజేంద్రనాథ్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. లోకేష్ తనను టిడిపిలో చేరాలని పిఎ చైతన్య ద్వారా రాయబారం పంపారని అన్నారు. తను నిరాకరించినందున హాని తలపెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. లోకేష్ బండారం బయటపెట్టానని టిడిపి తనపై కుట్ర పన్నుతోందన్నారు.










