హైదరాబాద్ : తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. పలు హిట్ సినిమాలకు పనిచేసిన ప్రముఖ సీనియర్ ఎడిటర్ పి.వెంకటేశ్వరరావు (72) మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. అలనాటి హీరోలతో పలు యాక్షన్ సినిమాలు తీసిన దర్శకుడు కెఎస్‌ఆర్ దాస్‌కు ఆయన స్వయానా మేనల్లుడు. (రేపు) గురువారం చెన్నైలో వెంకటేశ్వరరావు అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటేశ్వరరావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. వెంకటేశ్వరరావు భార్య కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. వీరికి ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
4 భాషల్లో ... 200పైగా సినిమాలకు...
తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 200 పైగా సినిమాలకు ఎడిటర్‌గా వెంకటేశ్వరరావు పని చేశారు. ఎన్టీ రామారావు నటించిన యుగంధర్, మొండిమొగుడు పెంకి పెళ్ళాం, కెప్టెన్ కఅష్ణ, ఇద్దర అసాధ్యులే వంటి పలు హిట్ మువీలకు ఆయన ఎడిటర్‌గా చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి, పి వాసు, మంగిమందన్, వైకె నాగేశ్వర రావు, బోయిన సుబ్బారావు వంటి ప్రముఖ దర్శకులతో కలిసి పని చేశారు.










