ప్రజాశక్తి - ప్రత్తిపాడు (గుంటూరు జిల్లా) : అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడు గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొర్నెనాడుకి చెందిన ఈగ జనార్థనరావు (42) ఏడేకరాలు కౌలుకు తీసుకుని పత్తి, మిర్చి వేశారు. సాగు నిమిత్తం రూ. ఏడు లక్షలు అప్పు చేశారు. పంటలు సరిగ్గా పండకపోవడం, రుణదాతల ఒత్తిడితో మనస్తాపానికి గురైన జనార్థనరావు పురుగు మందు తాగి ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనకు భార్య సరస్వతి, కుమార్తె నాగలక్ష్మి, కుమారుడు చరణ్ ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.










