Apr 20,2023 15:17

ఇంటర్నెట్‌డెస్క్‌ : మీరు రోజూ బాగా నిద్రపోతున్నారా? లేక నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారా? ఇలాంటి సమస్యలకు ప్రధాన కారణం ఒత్తిడికి గురిచేసే కార్టిసాల్‌ హర్మోన్‌ వల్లేనని వైద్యులు చెబుతున్నారు. కార్టిసాల్‌ హార్మోన్‌ అసమతుల్యతవల్ల అతిగా తినడం, లేదా అస్సలు తినకపోవడం కూడా చేస్తుంటారట. ఇక నిద్ర కూడా అంతే. హార్మోన్‌ స్థాయి తగ్గితేనే నిద్ర వస్తుంది.. లేకపోతే నిద్రలేమితో బాధపడతారని వైద్యులు అంటున్నారు. ఈ హార్మోన్‌ శరీరానికి, మనస్సుకి ఒకదానినొకటి అనుసంధానించే హార్మోన్‌ అని కొలంబియా విశ్వవిద్యాలయం బిహేవియరల్‌ మెడిసిన్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ మార్టిన్‌ పికార్డ్‌ అన్నారు. కార్టిసాల్‌ సమతుల్యంగా ఉన్నప్పుడు రోజంతా పని బాగా చేస్తారు. అదే ఈ హార్మోన్‌ అసమతుల్యంగా ఉంటే పనిలో మెరుగుదల లోపిస్తుందని, రోగనిరోధక శక్తి కూడా తగ్గిస్తుందని డాక్టర్‌ ఫ్రిచియోన్‌ చెప్పారు. రోజువారీ వ్యాయామంలో భాగంగా యోగా చేస్తే ఈ హార్మోన్‌ స్థాయిలు సమతుల్యంగా ఉంటాయని డాక్టర్‌ సగర్వాలా తెలిపారు. జాగింగ్‌, సైక్లింగ్‌ వంటి వ్యాయామాలు ఒత్తిడిని తగ్గిస్తాయి. అధిక రక్తపోటుకు గురికాకుండా శారీరక శ్రమ దోహదపడుతుందని వైద్యులు చెబుతున్నారు.