Jun 22,2023 15:14

హైదరాబాద్‌: ఎన్నో అనుభవాల సమాహారం తన తండ్రి ఎన్టీఆర్‌ అని.. ఆయన వ్యక్తిత్వం అందరికీ ఆదర్శప్రాయమని నటుడు, బసవతారకం ఆస్పత్రి ఛైర్మన్‌ నందమూరి బాలకృష్ణ అన్నారు. గురువారం బసవతారకం ఆస్పత్రి వార్షికోవత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో నూతన పరికరాలను బాలకఅష్ణ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలకఅష్ణ మాట్లాడుతూ.. క్యాన్సర్‌పై పెద్దగా ఆవగాహన లేని రోజుల్లో తన తల్లి బసవతారకం కోరిక మేరకు ఆస్పత్రిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 2000లో రూ.4 కోట్లతో ఆస్పత్రిని ప్రారంభించినట్లు వెల్లడించారు. బసవతారకం ఆస్పత్రి ఏర్పాటులో టిడిపి అధినేత చంద్రబాబు ఎంతో సహకారం అందించారని పేర్కొన్నారు. ఇవాళ అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చి క్యాన్సర్‌కు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. దేశంలోనే రెండో ఉత్తమ క్యాన్సర్‌ ఆస్పత్రిగా నిలిచిందన్నారు.వేడుకల్లో బాలకఅష్ణ, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు, ప్రణవి చంద్ర, నటి శ్రీలీల పాల్గొన్నారు.