అమరావతి: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్నారు.. అయితే, ఆయన బెయిల్ కోసం, మరోవైపు హౌస్ రిమాండ్ కోసం.. ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించడం లేదు.. ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా రంగంలోకి దిగి వాదనలు వినిపిస్తున్నారు. ఈ సమయంలో ఆయన చేసిన ఓ ట్వీట్ .. ఆసక్తికరంగా మారింది.. స్కిల్ స్కాం కేసులో రిమాండ్లో ఉన్న చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా ట్వీట్ చర్చకు దారిసింది.. ''అన్ని విధాలుగా ప్రయత్నించినప్పుడు ఇంకా న్యాయం కనుచూపు మేరలో లేదు అని తెలిసినప్పుడు.. కత్తి తీసి పోరాటం చేయడమే సరైనది'' అని గురు గోవింద్ సింగ్ వ్యాఖ్యలను ట్విటర్‌లో షేర్ చేశారు.. 'ఈరోజు ఇదే మా నినాదం' అని ఆయన పేర్కొన్నారు. దీంతో మీరే గెలుస్తారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. మరికొందరు నెగిటివ్ కామెంట్లు కూడా రాసుకొస్తున్నారు. కాగా బుధవారం చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా చంద్రబాబుతో మూలాఖత్ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్నారు. అయితే చంద్రబాబు భద్రత రిత్యా.. కారును బయటే నిలిపివేయాలని జైలు అధికారుల సూచించారు. జైలు అధికారుల సూచన మేరకు కారు బయటే ఆపి లూథ్రా లోపలికి నడుచుకుంటూ వెళ్లారు. మరికాసేపట్లో చంద్రబాబుతో భేటీ కానున్నారు.










