Jul 11,2022 07:50

ఎన్‌టిఆర్‌ : రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం జరుగుతున్న మున్సిపల్‌ కార్మికుల సమ్మె కార్యక్రమం కొండపల్లిలో కొనసాగింది. సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొండపల్లి మున్సిపాలిటీ కార్మికులు సమ్మెను కొనసాగించారు. కొండపల్లి మున్సిపాలిటీ పుర వీధుల్లో మున్సిపల్‌ కార్మికులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రదర్శన నిర్వహించారు. వర్షంలోనే నినదిస్తూ ... తమ బాధలను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు సేవ చేసే తమను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమంటూ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి మహేష్‌, మున్సిపల్‌ కార్మికులు పాల్గొన్నారు.