Sep 15,2023 16:35

హైదరాబాద్‌ : ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది. ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, కేంద్రం తెచ్చే బిల్లులు తదితర అంశాలపై పార్టీ వైఖరి, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. పార్టీ పార్లమెంటరీ నేత కే కేశవరావు, లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వర్‌రావు సహా ఎంపీలందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు.