అమరావతి: సీఐడీ కస్టడీ పిటిషన్‌పై మళ్లీ అదే ఉత్కంఠ నెలకొంది.గురువారం సాయంత్రం వస్తుందనుకున్న తీర్పు విషయంలో న్యాయమూర్తి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. తీర్పును శుక్రవారానికి వాయిదా వేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో విచారణకై 5 రోజుల కస్టడీ కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్ వేయగా.. ఇరు పక్షాల వాదనలు ధర్మాసనం.. తొలుత సాయంత్రం తీర్పు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే, సాయంత్రం తీర్పును రేపటికి వాయిదా వేస్తున్నట్లు జడ్జి ప్రకటించారు.
ఇదిలాఉంటే.. కోర్టు తీర్పు వెలువరించనుందనే ప్రచారం నేపథ్యంలో కుంచనపల్లి ఏసీబీ కోర్టు దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. విజయవాడ ఏసీబీ కోర్టు ఏం తీర్పు ఇస్తుంది? అని ఉత్కంఠ అందరిలో నెలకొనగా.. తీర్పును రేపటికి వాయిదా వేస్తూ న్యాయస్థానం నిర్ణయించడంతో.. అంతా సైలెంట్ అయ్యారు. కాగా, స్కిల్ స్కాంలో చంద్రబాబును 5 రోజుల కస్టడీకి కోరుతూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో బుధవారం వాడీవేడీగా వాదనలు కొనసాగాయి. కస్టడీకి ఇవ్వాలని ఇటు ఏఏజీ.. అటు న్యాయవాది లూథ్రా.. న్యాయమూర్తి ఎదుట సుదీర్ఘంగా బలమైన వాదనలు వినిపించారు. దీనిపై ఎలాంటి తీర్పు రాబోతుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.స్కిల్ డెవలప్‌మెంట్ పరుతో అప్పట్లో రూ. 371 కోట్ల మేర స్కామ్ జరిగిందని సీఐడీ అంటోంది. చంద్రబాబును కస్టడీకి కోరుతూ ఏఏజీ పొన్నవోలు కూడా వాదనలు వినిపించారు. ఆన్ని ఆధారాలతోనే అరెస్ట్ జరిగిందని.. కేసుతో ప్రమేయం ఉన్న ప్రతీ ఒక్కరిని మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందన్నారు. కేసులో రికవరీ కంటే కుట్ర కోణాన్ని వెలికితీయడమే అసలు ఉద్దేశమన్నారు. చంద్రబాబును కస్టడీకి ఇస్తే మరిన్ని వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఏఏజీ వాదించారు.










