తాడ్వాయి (ములుగు) : నిన్న ములుగు జిల్లాలోని వరదల్లో గల్లంతైనవారిలో ఐదుగురి మృతదేహాలు శుక్రవారం లభ్యమయ్యాయి. ఏటూరునాగారం మండలం కొండాయిలో ఉన్న జంపన్నవాగు ఉధృతికి గురువారం ఎనిమిదిమంది గల్లంతయ్యారు. తాజాగా... తాడ్వాయి మండలం మేడారం వద్ద వరదలో ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతావారికోసం గాలింపు కొనసాగుతోంది. భారీ వర్షాలకు ములుగు జిల్లాలో జలప్రళయం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో వరదల్లో గల్లంతై ఐదుగురు మృతి చెందారు. రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. మేడారం గ్రామాన్ని వరద ముంచేసింది. జంపన్నవాగునకు వరద పోటెత్తింది. దీంతో మేడారం సమ్మక్క సారక్క గద్దెల వరకు నీరు వచ్చి చేరింది. మేడారం ప్రాగణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గత రాత్రినుంచే జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది.










