ప్రజాశక్తి-నందిగామ (ఎన్‌టిఆర్) : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పునకు నిరసనగా నందిగామ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గత ఐదు రోజులుగా దేశం పార్టీ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. శనివారం నందిగామ మాజీ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య నియోజకవర్గ మహిళా నాయకులతో కలిసి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి తిరిగి అన్న ఎన్టీఆర్ పేరును పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు.










