హైదరాబాద్: చందానగర్ లో స్విగ్గీ డెలివరీ బాయ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. జహీరాబాద్ జిల్లాకు చెందిన అనిల్ లింగంపల్లిలో నివాసం ఉంటున్నాడు. ఉదయం తన బైక్ పై స్విగ్గీ డెలివరీ కోసం బయలుదేరిన అనిల్.. నల్లగండ్ల వెరిటేక్స్ విల్లా నిర్మాణాల్లో ఉన్న ట్రాన్స్ ఫార్మర్ దగ్గర మృతి చెందాడు. అనిల్ మృతదేహాన్ని చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కరెంట్ షాక్ తగిలి అనిల్ మృతి చేందినట్లు అనుమానించారు. ఇంకా పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.










