ఇంటర్నెట్‌డెస్క్ : తన కడుపులో పురుడుపోసుకున్న పాపాయి కోసం తల్లి వేయి కళ్లతో ఎదురుచూస్తుంది. తల్లిగా తన జీవితంలోని మధుర క్షణాలను పూర్తిగా ఆస్వాదించక ముందే ఆమె డిప్రెషన్‌కి లోనవుతుంది. ప్రసవం తర్వాత ప్రతి తల్లి ఈ దశను దాటి రావాల్సిందే. గర్భం దాల్చినప్పుడు ఇష్టమైనవి తిని, కంటినిండా నిద్రపోయే మహిళలు ఆ తర్వాత నిద్రలేమి సమస్యతో మరింత కుంగిపోతారు. మరి ప్రసవానంతరం ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కొవాలో వైద్యలు కొన్ని సూచనలిచ్చారు. అవేంటో తెలుసుకుందామా..!
- ప్రసవానంతరం మహిళల్లో విడుదలయ్యే హార్మోన్లలో మార్పులు సంభవిస్తాయి. ఆ సమయంలో సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల.. నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల డిప్రెషన్‌కి గురవుతారు. ప్రతికూల ఆలోచనలకు వస్తాయని వైద్యులు అంటున్నారు. అయితే ఈ సమయంలో మహిళలకు భర్త, కుటుంబ సభ్యుల సహకారం ఉంటే ఆమె డిప్రెషన్‌కి గురికాకుండా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇక మరీ తీవ్ర డిప్రెషన్‌కి వెళితే.. కచ్చితంగా సైకాలజిస్టులను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు. వారి సహాయంతో ఇంటర్‌పర్సనల్ థెరపీ (ఐపిటి) తీసుకుంటే ఈ సమయంలో ఉన్న మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుందని డాక్టర్లు అంటున్నారు.
- కుటుంబ సహకారం, వైద్యుల సూచనలతోపాటు.. శారీరక వ్యాయామం, మంచి ఆహారం, తగినంత నిద్రపోతే ఈ సమస్య నుంచి త్వరగా బయటపడతారని వైద్యులు చెబుతున్నారు.