Apr 15,2023 11:49
  • ముడుపులు ఇవ్వనిదే సంతకాలు పెట్టరు
  • ప్రక్షాళన చేయకుంటే మహిళల తిరుగుబాటు తప్పదు

ప్రజాశక్తి- హిందూపురం (అనంతపురం) : రహమత్‌పురంలో కొన్ని సంఘాలు కలిసి నూతనంగా ఒక సమాఖ్యను ఏర్పాటు చేసుకున్నాయి. అప్పటికే పాత సమాఖ్యలో మహిళలు పొదుపు చేసుకున్న డబ్బులను పాత సమఖ్యాల నుంచి నూతనంగా ఉర్పాటు చేసుకున్న సంఘంలోకి చెక్‌ కూపంలో వేశారు. అయితే చెక్‌ ను తనకు తెలియకుండా ఎలా వేశారు అన్న కారణంతో మహిళలు వారు పొదుపు చేసుకున్న డబ్బులను ఖాతా నుంచి తీసుకోవాడానికి సమాఖ్యకు సంబంధించిన సిఓ సంతకం పెట్టడానికి గత నాలుగు రోజులుగా కార్యలయం చుట్టు తిప్పుతున్నారు.
         ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా ఆదుకోవాలని ఆసరా పథకంతో మూడవ సారి ఆయా మహిళా సంఘాలకు నిధులు జమ చేసింది. ఈ నిధులు పొదుపు ఖాత నుంచి సభ్యుల ఖాతకు బదలీ చేయడానికి తీర్మానం రాయాలని, దీనికి ఆర్పిలు ఒక తీర్మానంకు రూ.200 తీసుకుంటున్నారు. అంటే హిందూపురం పురపాలక సంఘంలో 1699 సంఘాలకు ఆసరా మంజూరు చేశారు. ఒక సంఘానికి రూ.200లతో రూ.3.39 లక్షలు ఒక్క ఎప్రిల్‌ నెలలో అవినీతి జరిగింది. దీంతో పాటు ఒక్క పొదుపు సంఘానికి రూ. లక్ష రుణం మంజూరు అయితే సిఓకు రూ. 1000 కమిషన్‌ ఇవ్వాల్సిందే. ఇలా ప్రతి ఋణంలోను సిఓలకు, ఆర్పిలకు కమిషన్లను ముట్ట చెప్పాల్సిందే. లేని పక్షంలో సిఓలు సంతకాలు పెట్టరు.
      హిందూపురం పులపాలక సంఘంలోని పేదరిక నిర్మూలన సంస్థ విభాగంలో అవినీతి కంపు కొడుతున్నది. మహిళా సంఘాల ప్రతినిధులు, మహిళలు ఆర్‌ పి నుంచి సి ఓ ల వరకు ముడుపులు ఇవ్వనిదే సంతకాలు పెట్టడం లేదు. చివరకు ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా ఆదుకోవాలని సంకల్పించి ఆసరా పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తే.... ఆ డబ్బులు ఎ వారి ఖాతాలో నుంచి తీసుకోవాలన్న మహిళలు ముడుపులు ఇవ్వాల్సి ఉంది. చివరకు ప్రతి నెల మహిళలు పొదుపు చేసుకున్న డబ్బులను వారి ఖాతాలో నుంచి తీసుకోవాలన్నప్పటికీ ఆర్‌.పి. సీఓలు సంతకం పెట్టాల్సిందే. దానికి వారు ముడుపులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందంటే ఇక్కడ అవినీతి ఎంత పెద్ద ఎత్తున జరుగుతున్నదో అర్థమవుతుంది.
         హిందూపురం పురపాలక సంఘంలో ఒక విభాగం అయిన మెప్మాలో అవినీతి రాజ్యమేలుతోంది. పెద్ద ఎత్తున కమీషన్ల పర్వం సాగుతోంది. పొదుపు మహిళలను నిలువుదోపిడీ చేస్తున్నారు. ప్రత్యక్షంగా కొందరు ఆర్పీలు వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నప్పటికీ ఆ శాఖలోని అందరికీ వాటాలు అందుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్‌ పరిధిలో మెప్మా పరంగా మొత్తం 25550 పొదుపు గ్రూపులు ఉన్నాయి. ఒక్కో సంఘంలో 10మంది సభ్యులు ఉంటారు. కొన్ని గ్రూపులను కలిపి సమాఖ్యలుగా ఉంటాయి. ఆయా గ్రూపుల సభ్యుల నుంచి ఆర్పీ (రీసోర్స్‌ పర్సన్‌)లను ఎన్నుకుంటారు. మొత్తం 81 మంది ఆర్పీలు ఉన్నారు. వీరిని 5 మంది సిఓలు (కమ్యూనిటీ ఆర్గనైజర్స్‌)లు పర్యవేక్షిస్తున్నారు. మహిళలు రెండు రకాలుగా పొదు చేసుకుంటారు. ఈ పొదుపులో నుంచి అవసరం మేరకు ఆ సంఘంలో తీర్మానం చేసుకుని ఋణాలను తీసుకుని, వారు ప్రతి నెల చెల్లిస్తారు. దీనికి సైతం సిఓలు సంతకం పెట్టాలన్నా మహిళలను కార్యాలయం చుట్టు తిప్పుతున్నారు. ఆయా సంఘాల వద్దకు వెళ్లి తీర్మానాలను రాయాలన్న నిబంధనలు ఉన్నాయి. అయితే వాటిని సిఓలు తుంగలో తొక్కి నిత్యం మహిళలను మున్సిపల్‌ కార్యలయం చుట్టు తిప్పుతున్నారు. రంజాన్‌ మాసంలో ముస్లీం మహిళలు వారు పొదుపు ఖాతలో నుంచి కాస్త రుణం తీసుకోవాడానికి ఉపవాస దీక్షలో సైతం గంటల తరబడి సిఓల సంతకం కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి హిందూపురంలో ఉంది. అంత సేపు వేచి ఉన్నా వారు సంతకాలు పెడతారన్న భరోసా సైతం ఉండదు. ఎంతో మందిని సి ఓ లు సంతకాలు పెట్టకుండా తిరిగి పొంపిన సంఘటనలు ఉన్నాయి.

-ఆర్‌ పి ల ఇష్టారాజ్యం....
ప్రభుత్వపరంగా అమలయ్యే పథకాల ఫలాలను లబ్దిదారులకు అందేలా చూడాల్సిన బాధ్యత ఆర్బీలది. బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణం మంజూరులో సహాయపడాలి. అలాగే గ్రూపుల సభ్యులు తీసుకున్న స్త్రీ నిధి తదితర రుణాలకు సంబంధించి తిరిగి చెల్లింపులు సకాలంలో చేయించాలి. అయితే కొందరు ఆర్పీలు సిఓల సహాకారంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రుణాల మంజూరు సమయంలో చేతివాటం చూపుతున్నారు. కమీషన్ల రూపేణా లబ్దిదారుల నుంచి భారీగా డబ్బు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రూ. లక్షకు రూ. 1000 చోప్పున కమీషన్‌ నిర్ణయించి బహిరంగంగానే వసూలు చేస్తున్నారు. బ్యాంకుల చుట్టూ తిరిగి పనులు చేయిస్తున్నాం కదా.. ఖర్చులు ఉంటాయి.. అందుకే కమీషన్‌ అంటూ లబ్ధిదారుల వద్ద మక్కుపిండి వసూలు చేస్తున్నారు. పురపాలక సంఘంలో 25550 సంఘాలు ఉన్నాయి. ఇందులో దాదాపు నెలకు 1000 సంఘాలకు పైగా ఋణాలను తీసుకుంటారు. ఈ లెక్కన నెలకు రూ. ..10లక్షలకు అవినీతి జరుగుతున్నది. ఇంత జరుగుతున్న ఎలాంటి విచారణ చేయక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వసూలు చేసిన సొమ్ములో అందరికీ భాగం ఉండటం వల్లనే మిన్నకుంటున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. దీనిపై పూర్తి విచారణ చేపడితే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది. లేని పక్షంలో మహిళలు ఆర్పిలకు, నీఓలకు వ్యతిరేకంగా తిరగబడే అవకాశాలు ఉన్నాయి.