ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : సుస్థిరమైన ఉపాధి ద్వారా మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం మెప్మా పనిచేస్తుందని మెప్మా మిషన్ డైరెక్టరు వి విజయలక్ష్మి పేర్కొన్నారు. మెప్మా సంస్థ జగనన్న మహిళా మార్టులు, జగన్ ఇ -మార్టులు, అర్బన్ మార్కెట్, మహిళా ప్రగతి యూనిట్లను ఏర్పాటు చేస్తుందన్నారు. తాడేపల్లిలోని కెఎల్ విశ్వవిద్యాలయంలో బుధవారం రాష్ట్ర వ్యాప్త పట్టణ సమాఖ్య పదాధికారులు, ఆర్‌పిల ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లోని 175 పట్టణ సమాఖ్యల నుంచి 700 మంది పట్టణ సమాఖ్య పదాధికారులు, ఆర్‌పిలు, ఎస్‌ఎమ్‌ఎమ్‌లు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.










