భారత్ వేదికగా జరగనున్న వన్డేప్రపంచకప్-2023కు శ్రీలంక క్వాలిఫై అయింది. ఐసీసీ వన్డే ప్రపంచకప్-2023 క్వాలిఫయర్స్‌లో శ్రీలంక మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఫైనల్‌కు అర్హత సాధించింది. ఆదివారం జింబాబ్వేతో జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 32.2 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో సీన్ విలియమ్స్(57 బంతుల్లో 56బీ 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ, రజా (31) పరుగులతో రాణించారు. మిగతా ఆటగాళ్లు క్రెయిగ్ ఎర్విన్ (14), ర్యాన్ బర్ల్ (16), బ్రాడ్ ఎవాన్స్ 14, ఎల్ జోంగ్వే (10), డబ్ల్యూ మసకద్జా (4), , మాధేవెరే (1), నగరవ(0), ముజరబానీ(0), జె గుంబీ(0) పరుగులు చేయడంలో విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో మహీశ్ తీక్షణ 4 వికెట్లతో చెలరేగగా.. మదుషంక 3 వికెట్లు, పతిరణ 2 వికెట్లు సాధించారు. అనంతరం 166 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 33.1 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే నష్టపోయి ఛేదించింది. లంక బ్యాటర్లలో ఓపెనర్ నిస్సంక(101) అజేయ శతకంతో ఆకట్టుకన్నాడు. అతడితో పాటు కరుణరత్నే(30), కుసాల్ మెండిస్ (25) పరుగులతో రాణించారు.










