Mar 25,2023 15:51
  • 198 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్‌ ఘన విజయం

ఆక్లాండ్‌ : ఆక్లాండ్‌ వేదికగా శనివారం జరిగిన తొలి వన్డేలో అతిథ్య న్యూజిలాండ్‌ చేతిలో శ్రీలంకతో ఘోరంగా ఓటమిపాలైంది. 275 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక.. 19.5 ఓవర్లలో 76 పరుగులకే చాపచుట్టేసింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ యువ పేసర్‌ హెన్రీ షిప్లే7 ఓవర్లలో 31 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. డారిల్‌ మిచెల్‌ 2, బ్లెయిర్‌ టిక్నర్‌ 2 వికెట్లు తీశారు. దీంతో198 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో కివీస్‌ 1-0 అధిక్యంలోకి వెళ్లింది.అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌.. 49.3 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌటైంది. ఫిన్‌ అలెన్‌ (51) హాఫ్‌ సెంచరీతో రాణించగా.. డారిల్‌ మిచెల్‌ (47), గ్లెన్‌ ఫిలిప్స్‌ (39), రచిన్‌ రవీంద్ర (49) పర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో చమిక కరుణరత్నే 4 వికెట్లు పడగొట్టగా.. రజిత, లహీరు కుమార తలో 2 వికెట్లు, మధుశంక, షనక చెరో వికెట్‌ దక్కించుకున్నారు.
   What a ball Mr Shipley 👏

Watch BLACKCAPS v Sri Lanka on-demand on Spark Sport#SparkSport #NZvSL pic.twitter.com/zHv8yZvr4M

  ఈ మ్యాచ్‌ ద్వారా లభించే మొత్తాన్ని కివీస్‌ క్రికెటర్లు ఇటీవల విధ్వంసం సష్టించిన గాబ్రియెల్‌ సైక్లోన్‌ బాధితులకు అందజేయనున్నారు. తుఫాను బాధితులకు సంఘీభావంగా ఆటగాళ్లు, స్టేడియంలోని ప్రేక్షకులు 14.2 ఓవర్‌ తర్వాత లేచి నిలబడి చప్పట్లు కొట్టారు.