- దక్షిణాఫ్రికాపై 3 పరుగుల తేడాతో గెలుపు
కేప్‌టౌన్ : మహిళల టీ20 ప్రపంచకప్-2022లో శ్రీలంక అద్భుత విజయం సాధించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో శ్రీలంక గెలిచింది. 130 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 126 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో కెప్టెన్ ఆటపట్టు 68, గుణరత్నే 35 పరుగులతో రాణించారు. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇస్మాయిల్, కాప్, క్లార్క్ తలా వికెట్ సాధించారు. అనంతరం లక్ష్య చేధనలో సాతాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్ లూస్ 28 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇక శ్రీలంక బౌలర్లలో రణవీర 3, రణసింఘే, సుగందికా కుమారి తలా రెండు వికెట్లు సాధించారు.










