ప్రజాశక్తి-గంపలగూడెం(ఎన్‌టిఆర్) : మండలంలోని సత్యాల పాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం తెలుగు భాషా, జాతీయ క్రీడా దినోత్సవం సంయుక్తంగా నిర్వహించినట్లు ఆ పాఠశాల హెచ్‌ఎం ఎం.శాసనం రాజు తెలిపారు. ఈ సందర్భంగా గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గిడుగు ప్రత్యేకతను వివరించారు. అదేవిధంగా జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ర్యాలీ చేపట్టారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వై పి రెడ్డి, గుర్రం గోపాలరావు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.










