- న్యూజిలాండ్‌పై 65పరుగుల తేడాతో గెలుపు
- ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్
కేప్‌టౌన్: ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్‌లో పెను సంచలనం నమోదైంది. టైటిల్ ఫేవరెట్ జట్లలో ఒకటైన న్యూజిలాండ్‌పై ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు సంచలన విజయం సాధించింది. బోలండ్ పార్క్ వేదికగా సోమవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మహిళల జట్టు 65పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 132పరుగులు చేసింది. ట్రయాన్(40), డీ క్లార్క్(28), లూస్(22) బ్యాటింగ్‌లో రాణించారు. అనంతరం దక్షిణాఫ్రికా బౌలర్లు మబా(3/10), ట్రియాన్(2/12), కాప్(2/13) బౌలింగ్‌లో చెలరేగారు. దీంతో న్యూజిలాండ్ జట్టు 18.1ఓవర్లలో 67పరుగులకే కుప్పకూలింది. ఈ టోర్నమెంట్‌లో న్యూజిలాండ్ జట్టుకు ఇది వరుసగా రెండో ఓటమి కాగా.. దక్షిణాఫ్రికా తొలి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ట్రియాన్‌కు లభించింది.
- మహిళల టి20 ప్రపంచకప్‌లో నేడు..
భారత్ × వెస్టిండీస్ (రా.6.30గం||లకు)
పాకిస్తాన్ × ఐర్లాండ్ (రా.10.30గం||లకు)










