Apr 25,2023 16:52

ఐపీఎల్‌-2023లో భాగంగా ఉప్పల్‌ వేదికగా ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం సాధించింది. గెలుపు ఆనందంలో ఉన్న కెప్టెన్‌ వార్నర్‌కు స్లో ఓవర్‌రేట్‌ కారణంగా ఐపీఎల్‌ నిర్వాహకులు భారీ జరిమానా విధించారు. ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు గాను వార్నర్‌ కు 12 లక్షల రూపాయ జరిమానా విధించినట్టు తెలిపారు. ఈ సీజన్‌ లో వార్నర్‌ కంటే ముందు జరిమానా ఎదుర్కొన్న కెప్టెన్ల జాబితాలో వరుసగా ఫాఫ్‌ డుప్లెసిస్‌ (ఆర్సీబీ), సంజూ శాంసన్‌ (రాజస్తాన్‌ ), సూర్యకుమార్‌ యాదవ్‌ (ముంబై), హార్ధిక్‌ పాండ్యా (గుజరాత్‌), కెఎల్‌ రాహుల్‌ (లక్నో) విరాట్‌ కోహ్లీ (ఆర్సీబీ) ఉన్నారు.