దుబాయ్ : ఇటీవలే న్యూజిలాండ్‌పై అద్భుతమైన డబుల్ సెంచరీ సాధించిన భారత క్రికెటర్ శుభ్‌మన్ గిల్.. జనవరి నెలకు గానూ 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్' అవార్డుకు ఎంపికయ్యాడు. గిల్... తన సహచర ప్లేయర్ మహ్మద్ సిరాజ్, కివీస్ ఆటగాడు కాన్వేలను వెనక్కినెట్టి ఈ పురస్కారం గెలుచుకున్నాడు. ఈ అవార్డును అందుకోవడం గిల్ కు ఇదే తొలిసారి. గత నెలలో అతడు మూడు సెంచరీలతో సహా 567 పరుగుల సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. వన్డే ఫార్మాట్‌లో డబుల్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా గిల్ రికార్డు సృష్టించాడు. మహిళల విభాగంలో ఇంగ్లాండ్‌కు చెందిన గ్రేస్ స్క్రీవెన్స్.. 'ప్లేయర్ ఆఫ్ ద మంత్'గా ఎంపికైంది.










