ఇంటర్నెట్డెస్క్ : జామకాయ ముక్కలపై ఉప్పు కారం చల్లి రోడ్డుపై అమ్ముతుంటారు. అలాగే పుచ్చకాయ ముక్కలపైనా పంచదార కలిపి అమ్మటం చూస్తుంటాం. అయితే రోడ్డుపై లేదా మనం ఇంట్లోనే పండ్ల ముక్కలపై సాల్ట్, షుగర్ కలిపిన వాటిని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. పండ్లే తీపిగా ఉంటాయి. వాటితో పంచదారని కలిపి తీసుకుంటే.. ఎక్కువ కేలరీలు చేరి.. మీరు బరువు పెరిగేందుకు కారణమవుతుంది అని వైద్యులు చెబుతున్నారు.
- పండ్ల ముక్కలపై ఉప్పు చల్లితే..వాటి నుండి నీరు ఎక్కువ వస్తుంది. వాటిపై సాల్ట్ చల్లకుండా ఉంటే.. నీరు తక్కువ వస్తుంది. పోషకాలు మెండుగా ఉంటాయి. అయితే ఉప్పు, పంచదార కాకుండా.. లవంగాల పొడిని, దాల్చినచెక్క పొడిని చల్లుకుని తింటే.. ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.