బంగ్లాదేశ్ దిగ్గజ ఆటగాడు షకీబ్ అల్ హసన్ తాజాగా ఓ అరుదైన రికార్డు సాధించాడు. ఇప్పటికే వైట్ బాల్ క్రికెట్‌లో వరల్డ్ నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా చెలామణీ అవుతున్న షకీబ్.. లేటెస్ట్‌గా వన్డేల్లో 300 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. చట్టోగ్రామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో రెహాన్ అహ్మద్ వికెట్‌ని పడగొట్టడం ద్వారా.. షకీబ్ ఈ 300 వికెట్ల మార్క్‌ని సాధించాడు. పలితంగా.. ఈ ఘనత సాధించిన తొలి బంగ్లాదేశ్ బౌలర్‌గా షకీబ్ రికార్డు సాధించాడు. ఇంతకుముందు బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో కేవలం ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే 200 వన్డే వికెట్ల మైల్‌స్టోన్‌ని అందుకున్నారు. ముష్రఫే మోర్తజా 218 వన్డేల్లో 269 వికెట్లు, అబ్దుర్ రజాక్ 153 వన్డేల్లో 207 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు షకీబ్ 227 వన్డేల్లో 300 వికెట్లు పడగొట్టి.. ఈ ఫీట్ సాధించిన తొలి బంగ్లా ఆటగాడిగా చరిత్ర సష్టించాడు.










