ఢిల్లీ : ఢిల్లీ టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. టీమిండియాపై ఒక పరుగు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుగా ప్రారంభించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ జట్టు 12 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. 6 పరుగులు చేసిన ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అవుట్ కాగా, మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్‌తో కలిసి దాటిగా ఆడారు. హెడ్ 40 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 39 పరుగులు చేయగా, లబుషేన్ 19 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు సాధించాడు. ప్రస్తుతం ఆసీస్ 62 పరుగుల ఆధిక్యంలో ఉంది.










