Mar 05,2023 11:23

హైదరాబాద్‌ : భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా ఫేర్‌వెల్‌ మ్యాచ్‌ ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా తన చివరి మ్యాచ్‌ ఆడుతోంది. డబుల్స్‌ మ్యాచ్‌ సానియా, బోపన్న- ఇవాన్‌ డోడిక్‌, మ్యాటెక్‌ సాండ్స్‌ జోడీ మధ్య జరుగుతోంది. సింగిల్స్‌లో రోహన్‌ బోపన్నతో సానియా తలపడనుంది. సానియా చివరి మ్యాచ్‌ను వీక్షించేందుకు పలువురు టాలీవుడ్‌, బాలీవుడ్‌, క్రీడా, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌, మాజీ క్రికెటర్లు యువరాజ్‌సింగ్‌, అజారుద్దీన్‌ తదితరులు ఎల్బీ స్టేడియంకు చేరుకున్నారు. మ్యాచ్‌ అనంతరం సాయంత్రం ఓ ప్రైవేట్‌ హౌటల్‌లో రెడ్‌ కార్పెట్‌ ఈవెంట్‌, గాలా డిన్నర్‌ జరగనుంది. సాయంత్రం గాలా డిన్నర్‌కు కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు, సినీ, క్రీడా ప్రముఖులు మహేశ్‌బాబు, ఏఆర్‌ రెహమాన్‌, సురేష్‌రైనా, జహీర్‌ఖాన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ తదితరులు హాజరుకానున్నారు.