న్యూఢిల్లీ: రెండుసార్లు కామన్వెల్త్ క్రీడల ఛాంపియన్ సైనా నెహ్వాల్ త్వరలో జరగనున్న ఆసియా క్రీడల శిక్షణనుంచి తప్పుకుంది. ఫిట్‌నెస్ సమస్యే కారణంగా రాబోయే ఆసియా క్రీడల జాతీయ బ్యాడ్మింటన్ సెలెక్షన్ ట్రయల్స్‌నుంచి పాల్గొనడం లేదని ట్విట్టర్ వేదికగా సైనా నెహ్వాల్ పేర్కొంది. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బారు) ఈనెల 4నుంచి 7వరకు తెలంగాణలోని జ్వాలా గుత్తా అకాడమీలో శిక్షణ నిర్వహించనుంది. ఇక చైనాలోని గ్వాంఝూ వేదికగా సెప్టెంబర్ 23, అక్టోబర్ 8మధ్య ఆసియా క్రీడలు జరగనున్నాయి. బారు కార్యదర్శి సంజరు మిశ్రా సోమవారం ఓ ప్రకటనలో సైనా నెహ్వాల్‌తోపాటు పురుషుల డబుల్స్ జోడీ కుశాల్ రాజ్, ప్రకాశ్‌రాజ్ కూడా ట్రయల్స్‌నుంచి వైదొలిగినట్లు తెలిపారు. రెండుసార్లు ఒలింపిక్స్ పతక విజేత పివి సింధు, హెచ్‌ఎస్ ప్రణరు రారు, డబుల్స్ జోడీ చిరాగ్ శెట్టి-సాత్త్విక్ సాయిరాజ్, మహిళల డబుల్స్ జంట త్రీసా జోలీ-గాయత్రీ గోపీచంద్‌తో పాటు బిడబ్ల్యుఎఫ్ టాప్-20 ర్యాంకింగ్స్‌లో ఉన్న ఆటగాళ్లు నేరుగా ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు అర్హత సాధించనున్నారు.










