Jan 26,2023 21:10
  • నేడు పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్స్‌
  • ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లోకి కజకిస్తాన్‌కు చెందిన ఎలేనా రైబకినా, రష్యాకు చెందిన అర్యానా సబలెంకా ప్రవేశించారు. గురువారం జరిగిన సెమీస్‌లో ఎలేనా 7-6(7-4), 6-3తో రష్యాకు చెందిన విక్టోరియా అజరెంకాపై గెలుపొంది తొలిసారి ఆస్ట్రేలియా ఓపెన్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఉత్కంఠభరితంగా సాగిన సెమీస్‌ పోటీలో రైబకినా 24వ సీడ్‌, బెలారస్‌కు చెందిన అజరెంకాపై గెలిచింది. 22వ సీడ్‌గా బరిలోకి దిగిన రైబకినా తొలి సెట్‌ను టై బ్రేక్‌లో గెలిచింది. రాడ్‌ లెవెర్‌ ఎరేనాలో జరిగిన సెమీస్‌లో కజకిస్తాన్‌ అద్భుత ప్రదర్శనను కనబర్చింది. మరో సెమీస్‌లో సబలెంకా 7-6(7-1), 6-2తో లినెట్టె(పోలండ్‌)పై నెగ్గింది. శనివారం జరిగే ఫైనల్లో సబలెంకా, రైబకినా టైటిల్‌కై తలపడనున్నారు.
పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్‌ పోటీలు శుక్రవారం జరగనున్నాయి. తొలి సెమీస్‌లో 18వ సీడ్‌, రష్యాకు చెందిన ఖచనోవ్‌, 3వ సీడ్‌ గ్రీక్‌కు చెందిన సిట్సిపాస్‌తో తలపడనున్నాడు. మరో సెమీస్‌లో 4వ సీడ్‌, సెర్బియాకు చెందిన టైటిల్‌ ఫేవరెట్‌ నొవాక్‌ జకోవిచ్‌ అన్‌సీడెడ్‌ టామీ పాల్‌(అమెరికా)తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.