విండీస్ పర్యటనలో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. కరీబియన్‌కు చేరుకున్న భారత ఆటగాళ్లు తమ ప్రాక్టీస్‌ను ఆరంభించారు ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు బుధవారం విండీస్ దిగ్గజ ప్లేయర్ గ్యారీ సోబర్స్‌ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆటగాళ్లను అందరిని దగ్గరుండి పరిచయం చేయించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతోపాటు శుభ్‌మన్ గిల్, అశ్విన్, శార్దూల్ ఠాకూర్ లాంటి క్రికెటర్లు గ్యారీ సోబర్స్‌తో మాట్లాడారు. గ్యారీ సోబర్స్ రోహిత్, విరాట్‌లతో ప్రత్యేకంగా ముచ్చటించాడు. ఈ వీడియోను బీసీసీఐ షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.
ఇండియా టీమ్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే, కేఎస్ భరత్, ఇషాన్ కిషన్, అశ్విన్, జడేజా, శార్దూల్, అక్షర్, సిరాజ్, ముకేశ్ కుమార్, జైదేవ్ ఉనద్కట్, నవ్‌దీప్ సైనీ










