ఇంటర్నెట్‌డెస్క్ : పిల్లలు, పెద్దలు చిప్స్‌ని అమితంగా ఇష్టపడతారు. ఎప్పుడూ పొటాటో, కార్న్ చిప్స్‌నే తినేవారు.. ఈసారి కొత్తగా యాపిల్ చిప్స్‌ని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని న్యూట్రీషియన్స్ చెబుతున్నారు. మరి యాపిల్ చిప్స్‌ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా..!
తయారీ విధానం
- యాపిల్ విత్తనాలు తీసి సన్నని ముక్కలుగా కోసుకుని ట్రేలో పెట్టుకుని ఓవెన్‌లో 93 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద వేడి చేసుకోవాలి. అలా వేడి చేసుకున్న తర్వాత చిప్స్‌లా అవతాయి. వాటిపైన దాల్చిన చెక్క పొడి, బ్రౌన్ షుగర్ వేసుకుని కలుపుకుని ఈవినెంగ్ స్నాక్స్‌లా తీసుకుంటే రుచితోపాటు, ఆరోగ్యానికి ఆరోగ్యమూ ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.