May 31,2023 16:12

లండన్‌ వేదికగా జూన్‌ 7నుంచి జరగనున్న వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియా-భారత జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటికే రెండు బ్యాచ్‌లుగా లండన్‌కు చేరుకున్న రోహిత్‌ సేన.. ప్రాక్టీస్‌లో చేస్తోంది. ఈ ఫైనల్‌ మ్యాచ్‌ కోసం టీమిండియా మూడో బ్యాచ్‌ కూడా ఇంగ్లడ్‌కు చేరుకుంది. అజింక్యా రహానే, కేఎస్‌ భరత్‌, శుభ్‌మన్‌ గిల్‌, షమీ, రవీంద్ర జడేజాలతో బుధవారం లండన్‌కు చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను వికెట్‌ కీపర్‌ శ్రీకర భరత్‌, రహానే సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.