Oct 12,2022 12:41

ఎన్‌టిఆర్‌ : ఆర్‌టిసి బస్సుకు తృటిలో పెనుప్రమాదం తప్పింది. బుధవారం గుడివాడ నుండి విజయవాడ దారి వెండ్రపగడ మార్గమధ్యలో భీమవరం నుండి విజయవాడకు వస్తున్న ఆర్‌టిసి బస్సు అదుపుతప్పి పక్కకు వంగిపోయింది. స్థానికుల సాయంతో బస్సులో ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.