May 17,2023 16:16

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. రిలీ రోసో 37 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 82 నాటౌట్‌ విధ్వంసం సృష్టించగా.. పృథ్వీ షా 38 బంతుల్లో 54 పరుగులు, డేవిడ్‌ వార్నర్‌ 31 బంతుల్లో 46 పరుగులతో రాణించారు. ఫిలిప్‌ సాల్ట్‌ 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 26 పరగులు చేశాడు. పంజాబ్‌ బౌలర్లలో శామ్‌ కరణ్‌ 2 వికెట్లు తీసుకున్నాడు.

స్కోర్‌బోర్డు..
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌:
వార్నర్‌ (సి)ధావన్‌ (బి)కర్రన్‌ 46, పృథ్వీ షా (సి)అథ్వర థైడే (బి)కర్రన్‌ 54, రోషా (నాటౌట్‌) 82, ఫిలిప్‌ సాల్ట్‌ (నాటౌట్‌) 26, అదనం 5. (20 ఓవర్లలో 2వికెట్ల నష్టానికి) 213పరుగులు.
వికెట్ల పతనం: 1/94, 2/148
బౌలింగ్‌: సామ్‌ కర్రన్‌ 4-0-36-2, రబడా 3-0-36-0, ఆర్ష్‌దీప్‌ సింగ్‌ 2-0-21-0, ఎల్లిస్‌ 4-0-46-0, రాహుల్‌ చాహర్‌ 4-0-35-0, హర్‌ప్రీత్‌ బ్రార్‌ 3-0-39-0

  • రోసోవ్‌ 50

వన్‌డౌన్‌లో వచ్చిన రోసోవ్‌ 25 బంతుల్లో 50 పరుగులు చేశాడు. రోసోవ్‌ ఇన్నింగ్స్‌లో 4 సిక్స్‌లు, 4 పోర్లు ఉన్నాయి.

  • పృథ్వీషా ఔట్‌

54 పరుగులు చేసిన పృథ్వీషా శామ్‌ కరణ్‌ బౌలింగ్‌లో టైడ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవలియన్‌కు చేరాడు. మరోవైపు రుసోవ్‌ 21 బంతుల్లో 45 పరగులు చేశాడు. క్రీజులోకి ఫిలిప్‌ సాల్ట్‌ వచ్చాడు. ఢిల్లీ క్యాప్‌టల్స్‌ ప్రస్తుతం 2 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది.

పృథ్వీషా 50

ఓపెనర్‌ పృథ్వీషా 50 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. 36 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌ సాయంతో 50 పరుగులు చేశాడు. ఢిల్లీ ప్రస్తుతం 14 ఓవర్లకు 138 పరుగులు చేశాడు.

  • దంచి కోడుతున్న రుసో

వన్‌డౌన్‌లో వచ్చిన రిలీ రోసోవ్ 13 బంతుల్లో 2 సిక్స్‌లు, 3 ఫోర్ల సాయంతో 28 పరగులు చేశాడు. ఢిల్లీ ప్రస్తుతం 13 ఓవర్లకు 130 పరగులు చేసింది. క్రీజులో పృథ్వీషా 34 బంతుల్లో 49 పరగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

Absolutely Stunning! ⚡️ ⚡️

DO NOT MISS this brilliant catch from @PunjabKingsIPL captain @SDhawan25 🎥 🔽

A much-needed breakthrough for #PBKS 👌 👌

Follow the match ▶️ https://t.co/lZunU0I4OY #TATAIPL | #PBKSvDC pic.twitter.com/3j8NqsKJk8

  • వార్నర్‌ ఔట్‌.. ఢిల్లీ 94/1

31 బంతుల్లో 46 పరుగులు చేసిన ఢిల్లీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ శామ్‌ కరణ్‌ బౌలింగ్‌లో శిఖర్‌ ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. పృథ్వీషా 46 పరుగులు మీద బ్యాటింగ్‌ చేస్తున్నాడు. క్రీజులోకి రిలీ రోసోవ్ వచ్చాడు. ఢిల్లీ వికెట్‌ నష్టానికి 94 పరుగులు చేసింది.

  • దాటిగా ఆడుతున్న ఢిల్లీ ఓపెనర్స్‌.. 8 ఓవర్లుకు 76

ఢిల్లీ ఓపెనర్స్‌ దాటిగా ఆడుతున్నారు. 8 ఓవర్లు ముగిసే సరికి 76 పరుగులు చేశారు. డేవిడ్‌ వార్నర్ 23 బంతుల్లో 2 సిక్స్‌లు, 4 పోర్ల సాయంతో 37 పరుగులు, పృథ్వీషా 27 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్‌ సాయంతో 35 పరుగులు చేశాడు.

  • 6 ఓవర్లుకు.. ఢిల్లీ :61/0

ఢిల్లీ క్యాపిటల్స్‌ 6 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 61 పరుగులు చేసింది. డేవిడ్‌ వార్నర్ 18 బంతుల్లో 2 సిక్స్‌లు, 4 పోర్ల సాయంతో 34 పరుగులు, పృథ్వీషా 18 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్‌ సాయంతో 26 పరుగులు చేశాడు.

  •  3 ఓవర్లు.. ఢిల్లీ :18/0

3 ఓవర్లు పూర్తయ్యే సరికి ఢిల్లీ క్యాపిటల్స్‌ 18 పరుగులు చేసింది. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్  13 పరుగులు, మరో ఓపెనర్‌ పృథ్వీషా 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • నేడు పంజాబ్‌ vs ఢిల్లీ

2023లో భాగంగా 64వ మ్యాచ్‌ ఈ రోజు పంజాబ్‌ కింగ్స్‌ వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య హిమాచల్‌ ప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం, ధర్మశాలలో జరగనుంది. టాస్‌ గెలిచిన పంజాబ్‌ కింగ్స్‌ బౌలింగ్‌ ఎంచుకుంది.  ఈ మ్యాచ్‌లో గెలిచి పంజాబ్‌ ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలని చూస్తుండగా ఢిల్లీ కూడా ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు తమ 13వ లీగ్‌ మ్యాచ్‌ ఆడనున్నాయి. ఇంతకు ముందు కూడా రెండు జట్లు ముఖాముఖి పోరులో పంజాబ్‌ గెలిచింది.

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్(కెప్టెన్‌), అథర్వ టైడే, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్‌ కీపర్‌), సామ్ కుర్రాన్, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, కగిసో రబాడ, నాథన్ ఎల్లిస్, అర్ష్‌దీప్ సింగ్

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్ (కెప్టెన్‌), పృథ్వీ షా, ఫిలిప్ సాల్ట్ (వికెట్‌ కీపర్‌), రిలీ రోసోవ్, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, యష్ ధుల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్టే, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్