ప్రజాశక్తి-నందిగామ(ఎన్‌టిఆర్‌జిల్లా) : భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల పిల్లలకు నిరుపేదలకు పెళ్ళి కానుకగా శుక్రవారం రూ.5,116/- చొప్పున భవన నిర్మాణ కార్మికులకు యూనియన్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈసందర్భంగా యూనియన్ అధ్యక్ష , కార్యదర్శి షేక్ ఫిథాన్ మేస్త్రీ , కొట్టే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ఆకుల లక్ష్మీనారాయణ అడవిరావులపాడు గ్రామం, బత్తుల వీరయ్య నందిగామ, గుంజి సీత నందిగామ, నలుగురు భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల వారి ఆడపిల్లలకు ఈ నగదును అందజేశామని తెలిపారు. భవన నిర్మాణ కార్మికులకు యూనియన్ అండగా ఉంటుందని చెప్పారు. యూనియన్ ఆధ్వర్యంలో సీనియర్, వృద్ధాప్యంలో వున్న కార్మికులకు ప్రతి నెల ఫించన్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పుడు పెళ్లి కానుక ద్వారా వివాహం చేసుకున్న భవన కార్మికుల ఆడపిల్లలకు యూనియన్ ఆర్థిక చేయూత నిస్తోందని తెలిపారు. ఈకార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు షేక్. ఫిథాన్ మేస్త్రీ , కార్యదర్శి కొట్టే వెంకటేశ్వరరావు ,లీగల్ ఎడ్వయిజర్ లాయర్ కరీముల్లా , ఉపాధ్యక్షులు సూరా సత్యనారాయణ, ఉప్పుతోళ్ళ అంకులు , కోశాధికారి ఆకుల శేషగిరి ,వంగల నాగేశ్వరరావు, గౌరవ అధ్యక్షుడు చిన్నాబ్బాయి మేస్త్రీ తదితరులు పాల్గొన్నారు.










