ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాజమండ్రిలో ఈ నెల 27, 28 తేదీల్లో జరగనున్న టిడిపి మహానాడుకు భద్రతా ఏర్పాట్లు కల్పించాలని డిజిపికి టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు లేఖ రాశారు. రాజమండ్రిలోని కడియం మండలం, వేమగిరి గ్రామంలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగినంత పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరారు. సాధారణ ప్రజలకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. రవాణా ఏర్పాట్లు కోసం ఆర్‌సిటిసి ఎమ్‌డికి కూడా మరో లేఖ రాశారు. మహానాడుకు ప్రజలు విచ్చేసేందుకు అద్దె బస్సులు ఏర్పాటు చేసేలా ఆర్‌టిసి డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.










