- బిడబ్ల్యుఎఫ్ తాజా ర్యాంకింగ్స్‌లో 38వ స్థానం
లాసన్నె: అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య(బిడబ్ల్యుఎఫ్) తాజా ర్యాంకింగ్స్‌లో ఓర్లీన్ మాస్టర్స్ టైటిల్ నెగ్గిన ప్రియాంశు రాజవత్ కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో నిలిచాడు. బిడబ్ల్యుఎఫ్ మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ప్రియాంశు 38వ స్థానానికి ఎగబాకాడు. ఆదివారం జరిగిన ఓర్లీన్ మాస్టర్స్ టోర్నీ ఫైనల్లో ప్రియాంశు 21-15, 19-21, 21-16తో డెన్మార్క్‌కు చెందిన మాగస్ జొన్నాసెన్‌పై సంచలన విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రియాంశు 30,786పాయింట్లతో సింగిల్స్‌లో భారత షట్లర్లలో 4వ స్థానంలో నిలిచాడు. తాజా ర్యాంకింగ్స్‌లో లక్ష్యసేన్ 24, కిదాంబి శ్రీకాంత్ 23, స్థానాల్లో నిలువగా.. హెచ్‌ఎస్ ప్రణరు రారు టాప్-10లో చోటు దక్కించుకొన్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లోనూ ప్రణరు కెరీర్ బెస్ట్ ర్యాంక్ 8వ స్థానానికి నిలబెట్టుకున్నాడు. ఇక మహిళల సింగిల్స్‌లో పివి సింధు 11, సైనా నెహ్వాల్ 31వ ర్యాంకుల్లో ఉన్నారు. పురుషుల డబుల్స్‌లో సాత్త్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ 6వ ర్యాంక్‌కు ఎగబాకగా.. ఎంఆర్ అర్జున్-ధృవ్ కపిల జోడీ 27వ స్థానంలో ఉన్నారు. ఇక మహిళల డబుల్స్‌లో త్రీసా జోలీ-గాయత్రి గోపీచంద్ జంట 20, మిక్స్‌డ్ డబుల్స్‌లో త్రీసా-ఇషా భట్నాగర్ జంట 29వ స్థానాల్లో నిలిచారు.










