ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఎపిఎస్‌టిఎ ట్రైనింగ్స్, ఎగ్జామినేషన్స్‌కు సంబంధించిన సర్వే మెయిన్‌టెన్స్ పరీక్ష ఈ నెల 24న జరగాల్సి ఉండగా, పరీక్షను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సర్వే సెటిల్‌మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్సు కమిషనరు సిద్ధార్థజైన్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది తర్వాత తెలపనున్నట్లు పేర్కొన్నారు.










