Apr 25,2023 11:55

వి ఆర్‌ పురం (అల్లూరి) : మండలంలోని చిన్నమటపల్లి పంచాయతీలోని కన్నాయిగూడెం గ్రామంలో పోలవరం ఆర్‌ అండ్‌ ఆర్‌ ఇళ్ల సర్వే నిర్వహించిన కుటుంబాలను నోటిఫికేషన్‌ లో చర్చి ప్యాకేజ్‌ ఇవ్వాలని సిపిఎం నాయకులు అన్నారు. మంగళవారం సిపిఎం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార భేరి భాగంగా కన్నయ్యగూడెం గ్రామంలో ప్రతి ఇంటికి కరపత్రాలు పంచుతూ వాళ్ల సమస్యలు తెలుసుకుంటూ గ్రామసభ నిర్వహించారు. అందులో భాగంగా సిపిఎం మండల కార్యదర్శి సోయం.చిన్న బాబు మాట్లాడుతూ ... కన్నాయిగూడెం గ్రామం ముంపులో ఉన్న అన్ని కుటుంబాలవారికి కాంటూర్‌ లెక్కలతో సంబంధం లేకుండా పునరావాసం ప్యాకేజీ చెల్లించే విధంగా చుడాలని నిర్వాసితులు నేతల దఅష్టికి తీసుకొచ్చారని తెలిపారు. మండల కార్యదర్శి చిన్నబాబు మాట్లాడుతూ ... 2022 వరదలకు ఈ గ్రామం సర్వం కోల్పోయిందని, మళ్లీ వరదలు వస్తే నిర్వాసితులు జలప్రళయంలో చిక్కుకుపోతారని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని కోరారు. యుద్ధ ప్రాతిపదికన నిర్వాసితుల రక్షణకై ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. నిర్వాసితులకు పునరావాసం పరిహారం పూర్తి స్థాయిలో చెల్లించాలని అన్నారు. కన్నాయిగూడెం గ్రామాన్ని ముప్పులో చేర్చి సర్వే చేసి నోటిఫికేషన్‌ చేర్చి ప్యాకేజ్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగం చేస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వాసితులకు అన్యాయం చేస్తున్నాయని దుయ్యబట్టారు. మే 4 వ తేదీన చింతూరులో బహిరంగ సభను జయప్రదం చేయాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు.