May 10,2023 10:03

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ బుధవారం ఉదయం 10 గంటలకు రాజమండ్రికి చేరుకుంటారు. 11:30 గంటలకు కడియం ఆవలో పంటచేల పరిశీలన చేయడంతోపాటు కడియం గ్రామ రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:30 గంటలకు కొత్తపేట నియోజకవర్గం అవిడి గ్రామంలో రైతులతో ముఖాముఖి, 3 గంటలకు పి గన్నవరం నియోజకవర్గం రాజుపాలెంలో వరి, మొక్కజొన్నల పంటలను పరిశీలిస్తారు. రాత్రికి రాజమండ్రి షెల్టన్‌ హోటల్‌లో బస చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.