Sep 22,2023 21:56

న్యూఢిల్లీ : ఈ నెల 24న తొమ్మిది వందేభారత్‌ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్నారు. ఇందులో విజయవాడ-చెన్నై, హైదరాబాద్‌ (కాచీగూడ)- బెంగళూరు మధ్య నడిచే రైళ్లు కూడా ఉన్నాయి. వీటితోపాటు జైపూర్‌-ఉదరుపూర్‌, పాట్నా-హౌరా, రాంచీ-హౌరా, చెన్నై-తిరునెల్వెలి, పూరీ-రూర్కెలా, కాసర్‌గోడ్‌-తిరువనంతపురం, జమ్నానగర్‌-అహ్మదాబాద్‌ మధ్య వందేభారత్‌ రైళ్లను ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ రైల్వే స్టేషన్‌లో జరిగే ప్రారంభోత్సవంలో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాల్గొనే అవకాశాలున్నాయి. ఇందుకఁ సంబంధించిన భద్రతా ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతాఁకి ఇవన్నీ ఎఁమిది కోచ్‌లతో నడవనున్నాయి. ప్రస్తుతాఁకి దేశవ్యాప్తంగా 50 రూట్లలో 25 వందే భారత్‌ రైళ్లు నడుస్తున్నాయి.