Aug 17,2023 08:51

ప్రజాశక్తి-విశాఖ : విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ వెళ్లాల్సిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను నేడు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 5.45కి బయల్దేరాల్సిన రైలును సాంకేతిక కారణాలతో రద్దు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉదయం 7 గంటలకు మరో రైలును ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వందేభారత్‌ రైలు ఆగే స్టేషన్లన్నింటిలో ఈ రైలు ఆగుతుందన్నారు. ఉదయం 5 గంటల నుంచే రైలు రద్దు సమాచారాన్ని ప్రయాణికులకు అందజేశామన్నారు. కాగా, చివరకు నిమిషయంలో వందేభారత్‌ రైలు రద్దు కావడంతో ప్రయాణికులు రైల్వే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.