Mar 10,2023 22:03

క్రైస్ట్‌చర్చ్‌: డబ్ల్యుటిసి ఫైనల్స్‌ లక్ష్యంగా క్రైస్ట్‌చర్చ్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలిటెస్ట్‌లో శ్రీలంక జట్టు పట్టు బిగిస్తోంది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 6వికెట్ల నష్టానికి 305పరుగులతో రెండోరోజు ఆటను కొనసాగించిన శ్రీలంక జట్టు 365పరుగులకు ఆలౌటైంది. ధనుంజయ(46), రజిత(22) రాణించారు. సౌథీకి ఐదు, హెన్రీకి నాలుగు వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన న్యూజిలాండ్‌ జట్టు రెండోరోజు ఆట ముగిసే సమయానికి 5వికెట్లు కోల్పోయి 162పరుగులు చేసింది. ఓపెనర్‌ లాథమ్‌(67), కాన్వే(30) రాణించినా.. విలియమ్సన్‌(1), నికోల్స్‌(2) నిరాశపరిచారు. ఆ తర్వాత మిఛెల్‌(40నాటౌట్‌) రాణించడంతో న్యూజిలాండ్‌ జట్టు 5వికెట్లు కోల్పోయి 162పరుగులు చేసింది. ఫెర్నాండో, లాహిరుకు రెండేసి వికెట్లు దక్కాయి.