ప్రజాశక్తి-నందిగామ (ఎన్‌టిఆర్‌జిల్లా) : నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎన్‌ఎంఎంఎస్ స్కాలర్ షిప్‌కు ఎంపికైయ్యారని పాఠశాల హెచ్‌ఎం రాంబాబు నాయక్ తెలిపారు. వరికల్లు హర్షిణి, మోర్ల అక్సా బ్లెస్సి, పిట్టల రాఘవేంద్ర , ఓర్సు శ్రీనాథ్ కుమార్ , ఎంపికయ్యారని, వీరికి ఈ విద్యా సంవత్సరం నుండి 12 వేల రూపాయల చొప్పున ఇంటర్మీడియట్ పూర్తయ్యె వరకు నాలుగు సంవత్సరాలు ఈ స్కాలర్ షిప్ వస్తుందన్నారు. ఈ సందర్భంగా వరికల్లు హర్షిని వాళ్ళ తల్లిదండ్రులు పద్మ మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందిగామ లో చదువుకొని గత సంవత్సరం మా పెద్ద పాప వరికల్లు హరిణి త్రిబుల్ ఐటీ లో సీటు సాధించిందని ఇప్పుడు మరల రెండో అమ్మాయి వరికల్లు హర్షిని ఎన్‌ఎంఎంఎస్‌లో సీటు సాధించటం ఎంతో సంతోషంగా ఉందని అంటున్నారు.










