Feb 01,2023 21:10

హైదరాబాద్‌ : ప్రముఖ శీతలపానియం మజాకు హీరో అక్కినేని నాగర్జున బ్రాండ్‌ అంబాసీడర్‌గా నియమితులయ్యారు. భారత్‌, ఆగేయాసియాలో అత్యంత వేగంగా వద్ధి చెందుతున్న మజా ఇప్పుడు తమ నూతన 'ఆమ్‌వాలీ దిల్‌దారీ, బినా నామ్‌ వాలీ దిల్‌దారీ' ప్రచారం ప్రారంభించినట్లు ఆ సంస్థ తెలిపింది. తాజా ప్రచారంలో నటుడు అమితాబ్‌ బచ్చన్‌, నటి పూజా హెగ్డేతో పాటుగా దక్షిణాది సూపర్‌స్టార్‌ నాగార్జున కూడా కనిపించనున్నారని పేర్కొంది.