Aug 29,2023 11:52

కొరియోగ్రాఫర్‌ విజయ్ బిన్ని నా సామిరంగ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవు తున్నారు. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పవన్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మేకర్స్‌ ఒక గ్లింప్స్‌ , ఫస్ట్‌-లుక్‌ పోస్టర్‌ ద్వారా సినిమా టైటిల్‌ను కూడా ప్రకటించారు. ఈ చిత్రానికి 'నా సామిరంగ' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఏఎన్‌ఆర్‌ కల్ట్‌ హిట్‌ 'సిపాయి చిన్నయ్య'లోని నా సామిరంగ అనే ఐకానిక్‌ సాంగ్‌. హీరో నాగార్జున ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో బీడీ తాగుతూ మాస్‌గా కనిపించారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించ నున్నారు. ప్రసన్న కుమార్‌ బెజవాడ ఈ చిత్రానికి కథ, డైలాగ్స్‌ అందించారు. 'నా సామిరంగ' చిత్రాన్ని 2024 సంక్రాంతికి విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. పీఆర్వో: వంశీ-శేఖర్‌ వ్యవహరించనున్నారు.