Apr 24,2023 16:35

యంగ్‌ అండ్‌ డైనమిక్‌ హీరో అఖిల్‌ అక్కినేని, స్టైలిష్‌ మేకర్‌ సురేందర్‌ రెడ్డిల క్రేజీ స్టైలిష్‌ స్పై యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ 'ఏజెంట్‌' ఏప్రిల్‌ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సురేందర్‌ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఏజెంట్‌ ప్రమోషనల్‌ కంటెంట్‌ ట్రెమండస్‌ రెస్పాన్స్‌తో భారీ అంచనాలని పెంచింది. ఏప్రిల్‌ 28న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా వరంగల్‌ లో ఏజెంట్‌ మాసీవ్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ని నిర్వహించారు. అగ్ర హీరో అక్కినేని నాగార్జున ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్‌ గా జరిగింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, మేయర్‌ గుండు సుధారాణి, ఎంపీ పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యే అరూరి రమేష్‌ ఈ వేడుకలో పాల్గొన్నారు.
ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లో అగ్ర హీరో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ... వరంగల్‌ పోరాటాలకు అడ్డా. వీరత్వానికి ఇంటి పేరు.. వైల్డ్‌ వరంగల్‌. మా అందరికీ మీరంటే పిచ్చి. తెలుగు సినిమా ప్రేక్షకులు చాలా గొప్పవాళ్ళు సినిమాలంటే ప్రేమచూపిస్తారు.. ఒక కొత్త జోనర్‌ తో ఒక మంచి సినిమా ఇస్తే దాన్ని బ్లాక్‌ బస్టర్‌ చేసి తీరుతారు. సాక్షి బ్యూటీఫుల్‌ హీరోయిన్‌. తనకి చాలా మంచి భవిష్యత్‌ వుండాలి. సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి గారు కథ ఓప్పుకున్నారంటే అది మాములుగా వుండదు. ఆయన సినిమా ఒప్పుకున్నారని తెలిసి, ఖచ్చితంగా ఈ సినిమా అఖిల్‌ కి పెద్ద హిట్‌ అవుతుందని ఆనందపడ్డాను. ప్రేక్షకులు, అభిమానులు మా వెనుక లేకపోతే సినిమా బ్లాక్‌ బస్టర్‌ అవ్వదు. మిమ్మల్ని చూస్తుంటే తప్పకుండా సినిమా బ్లాక్‌ బస్టర్‌ అవుతుందనిపిస్తుంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు గారికి, మేయర్‌ గారికి, ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, అందరికీ కతజ్ఞతలు.'' తెలిపారు
హీరో అఖిల్‌ అక్కినేని మాట్లాడుతూ... ఈ వేడుకకు విచ్చేసిన మంత్రిగారికి, మిగతా అతిధులందరికీ కతజ్ఞతలు. ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు.. ఇక్కడికి వచ్చినందకు థాంక్‌ యూ నాన్న (నవ్వుతూ). ఏజెంట్‌ రెండేళ్ళ ప్రయాణం. నేను, సురేందర్‌ రెడ్డి గారు కలసినప్పుడు ఏదో క్రేజీగా చేసేద్దామనుకున్నాం. క్రేజీగానే చేశాం. ఇంత హైలో పని చేసిన తర్వాత నేను ఏమౌతాననే ప్రశ్న కూడా వుంది. ఏజెంట్‌ నాకు ధైర్యాన్ని నమ్మకాన్ని ఇచ్చింది. అనిల్‌ సుంకర గారు ఏజెంట్‌ కి బ్యాక్‌ బోన్‌. ఎంతగానో సపోర్ట్‌ చేశారు. సాక్షికి కతజ్ఞతలు. ఎడిటర్‌, డీవోపీ, మ్యూజిక్‌ డైరెక్టర్‌ టెక్నికల్‌ టీం అంతా ఒక మ్యాడ్‌ నెస్‌ ఇవ్వాలనే కసితో పని చేశాం. మమ్ముట్టి గారు ఈ ప్రాజెక్ట్‌ ఒప్పుకోవడం, ఆయనతో కలసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను. ప్రేక్షకులు, అభిమానుల ప్రేమ, బలం కోసమే నేను పని చేస్తున్నాను. మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటాను. ఏప్రిల్‌ 28న థియేటర్‌ లో కలుద్దాం. అందరికీ కతజ్ఞతలు'' తెలిపారు.
దర్శకుడు సురేందర్‌ రెడ్డి మాట్లాడుతూ. అఖిల్‌ ఈ సినిమాలో చాలా కష్టపడ్డాడు, సిక్స్‌ ప్యాక్‌ బాడీ చేశాడని అందరూ అంటున్నారు. కానీ నేను అఖిల్‌లో చూసింది కసి. ఏదో చేయాలి ఏదో సాధించాలనే కసి చూశాను. అదే నన్ను ముందుకు నడిపించింది. అఖిల్‌ కోసమే ఈ సినిమా చేశాను. అఖిల్‌ కి ప్రామిస్‌ చేశాను. ఆ ప్రామిస్‌ని నిలబెట్టుకున్నాననే నమ్ముతున్నాను. సినిమా చాలా బావుంటుంది. ప్రేక్షకులు ఆదరిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. టీం అంతా చాలా హార్డ్‌ వర్క్‌ చేసి సినిమా పూర్తి చేశారు. వారికి కతజ్ఞతలు. ఈ సినిమాకి మెయిన్‌ పిల్లర్‌ అనిల్‌ సుంకర గారు. ఆయన వలనే ఇంత దూరం రాగలిగాం. అందరికీ కతజ్ఞతలు'' తెలిపారు.